17 మంది ముందస్తు బెయిల్ పిటీషన్లు రద్దు..! 1 d ago
ఏపీ: టీడీపీ కార్యాలయం దాడి కేసులో నిందితులకు హై కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం 17 మంది పెట్టుకున్న పిటీషన్లను కొట్టేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం 2021 అక్టోబరు 19న మూక దాడి జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 89 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. పలువురు వైఎస్సార్ సీపీ కీలక నేతలను అరెస్ట్ చేశారు.